పోలింగ్‌ బూత్‌లోకి నో సెల్ ఫోన్స్

0
5

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. అయితే పోలింగ్‌ బూత్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతిస్తారా.. లేదా అన్నదానిపై తొలిసారి ఓటు వేస్తున్న వారికి సందేహాలుంటాయి.

దీనిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. పోలింగ్‌ బూత్‌లోకి సెల్‌ఫోన్లను అనుతించేది లేదని స్పష్టం చేశారు. ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి ఏదైనా గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఓటర్లు వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 15 నియోజకవర్గాలకు నోడల్‌ ఆఫీసర్లను ఆయన నియమించారు. నగరంలో మొత్తం 3,911 పోలింగ్ స్టేషన్లు, 60 షాడో టీంలు.. ఎన్నికల రోజు 518 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రాచకొండలో 1368 పోలింగ్‌ కేంద్రాలుండగా, 214 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here