వంతెన నిర్మాణానికి గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినూత్న నిరసన

0
13

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం చాణిక్యపురిలో కాలువపై వంతెన నిర్మాణానికి గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక ప్రజలు వంతెన గోడలు పగలగొట్టి నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని, దీంతో ప్రమాదకరంగా మారందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఎమ్మెల్యే వెంటనే అక్కడకు చేరుకుని ప్రజల బాధను తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే పలుసార్లు అధికారులకు తెలియజేసినా ముందుకు రాకపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాంతో వెంటనే మురుగు కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. కాలువలో ఉండే అధికారులకు ఫోన్‌ చేశారు. ఇక్కడకు వచ్చి పనులను ప్రారంభించే దాక ఇక్కడ్నుంచి కదలనని అధికారులకు తెలియజేశారు. దాంతో వెంటనే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈరోజే పనులు ప్రారంభించి, 45 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే నిరసన విరమించారు. శివాజీనగర్‌ వంతెనను ఎప్పుడు ప్రారంభిస్తారని అధికారులను అడుగగా వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనే తపన తనకుంటుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో ఎన్నో అడ్డంకులు, అవమానాలు, వేధింపులు ప్రభుత్వం, అధికార యంత్రాంగం నుంచి ఎదురవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here