ఇండియా vs ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్‌‌

0
3

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌‌లో వరుసగా కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) వికెట్లను చేజార్చుకున్న భారత్ జట్టు ఆ తడబాటుని కొనసాగిస్తోంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (46 బ్యాటింగ్: 141 బంతుల్లో 4×4) క్రీజులో పాతుకుపోయి ఒక ఎండ్‌లో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నా.. మరో ఎండ్‌లో వికెట్ల పతనం మాత్రం ఆగడం లేదు. దీంతో టీ విరామ సమయానికి భారత్ జట్టు 56 ఓవర్లలో 143/6తో నిలిచింది. కీలక సమయంలో హిట్టర్ రోహిత్ శర్మ (37: 61 బంతుల్లో 2×4, 3×6) , రిషబ్ పంత్ (25: 37 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడుతూ ఔటయ్యారు. పుజారాతో పాటు క్రీజులో ప్రస్తుతం అశ్విన్ (5 బ్యాటింగ్) ఉన్నాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ భారత్‌కి షాకిచ్చాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని ఫుష్ చేయబోయిన కేఎల్ రాహుల్ స్లిప్‌లో ఫీల్డర్ అరోన్ ఫించ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత.. వచ్చిన పుజారా నిలకడగా ఆడుతున్నా.. మరో ఓపెనర్ మురళీ విజయ్.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో డ్రైవ్ చేయబోయి వికెట్ కీపర్ టిమ్‌పైన్ చేతికి చిక్కాడు. నాలుగో స్టంప్‌ లైన్‌పై మిచెల్ స్టార్క్ బంతి విసరగా.. మురళీ విజయ్.. పాదాల కదల్చకుండా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో.. భారత్ 15/2తో నిలిచింది.

ఈ దశలో భారత్ జట్టుని ఆదుకుంటాడని ఆశించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పేలవ రీతిలో ఔటైపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి స్లిప్‌లో ఉస్మాన్ ఖవాజా చేతికి విరాట్ కోహ్లి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (13: 31 బంతుల్లో 1×6) కాసేపు నిలకడగా ఆడినా.. హేజిల్‌వుడ్ విసిరిన ఊరించే బంతికి దొరికిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here