బెంగాల్ వారియర్స్ ని ఓడించిన హరియాణా స్టీలర్స్

0
6

మోను గోయత్‌ మెరిశాడు. రైడింగ్‌లో 12 పాయింట్లతో సత్తాచాటి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో బుధవారం జరిగిన అంతర్‌ జోనల్‌ మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 35-33 తేడాతో బంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో కీలక పాయింట్లు సాధించిన హరియాణా విజేతగా నిలిచింది. తొలి అర్ధభాగంలో మరో ఐదు నిమిషాలు ఉందనగా మోను చెలరేగాడు. దాంతో తొలిసారిగా మ్యాచ్‌లో హరియాణా ఆధిపత్యం చలాయించి 19-12తో విరామానికి వెళ్లింది. అయితే చివరి అర్ధభాగంలో రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (11) సత్తాచాటడంతో బంగాల్‌ ఒక్కసారిగా పోటీలోకి వచ్చింది. మ్యాచ్‌లో మరో మూడు నిమిషాలు మాత్రమే ఉందనగా స్కోరు 30-30 అయింది. ఆ సమయంలో మోను రైడింగ్‌కు వెళ్లి రెండు పాయింట్లు తేవడంతో హరియాణా ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో దిల్లీ 32-31తో బెంగళూరుపై గెలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here