సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన సీఎం చంద్ర బాబు

0
6

ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. ‘రాబోయే తరం పర్యావరణ రవాణా’పై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఉదయం సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్యవస్థకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here