జిల్లాలకు కొత్త డిప్యూటీ కలెక్టర్లు

0
5

రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులో ఉన్న కడప ఆర్డీఓ మురళిని నెల్లూరు గ్రామీణాభివృద్ధి పీడీగా నియమించారు. ప్రస్తుతం అక్కడ విధుల్లో ఉన్న రోస్మోండ్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. అనంత పురం ఆర్డీఓ మలోలను కడప ఆర్డీఓగా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఆర్‌. కూర్మనాథ్‌ను అనంతపురం ఆర్డీఓగా నియమించారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న సీమానాయక్‌ను గుండ్లకమ్మ ప్రాజెక్టు భూసేకరణ విభాగానికి బదిలీ చేశారు. ఇక్కడ విధుల్లో ఉన్న పి. ఉమాదేవిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here