హువావే ఆర్థిక అధికారి అరెస్ట్‌

0
7

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్వో)ను కెనడా అధికారులు అరెస్ట్చేశారు.  షాకింగ్న్యూస్  పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై అరెస్టు చోటు చేసుకుంది.

హువావే బోర్డు  డిప్యూటీ చైర్కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె మెంగ్వాంగ్జోను వాంకోవర్లో డిసెంబరు 1, శనివారం అరెస్టు చేశామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమెబెయిల్పిటీషన్పై శుక్రవారం విచారణ జరగనుందని జస్టిస్ శాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్  వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమని పేర్కొన్నారు. 

మరోవైపు   పరిణామాన్ని  హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.  ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి  నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్చేసింది. తాము  చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది.  మేరకు ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here