భారతీయడు 2 లో కాజల్‌

0
10

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న చిత్రం ‘భారతీయడు 2’. బ్లాక్‌బస్టర్‌ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబరు 14న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. రెండో షెడ్యూల్‌ చెన్నైలో జరగనుందట.

కాగా ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతారను ఎంచుకున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే చివరికి కాజల్‌ నటించనున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి. ఈ సినిమాలో కమల్‌ సరసన కాజల్‌ నటించనున్నారట. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది.

కాజల్‌ తెలుగులో నటించిన ‘కవచం’ సినిమా డిసెంబరు 7న విడుదలకు సిద్ధమౌతోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ సినిమాతో రూపుదిద్దుకుంటోంది. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కనున్న 24వ సినిమాలోనూ కాజల్‌ సందడి చేయనున్నారు. శంకర్‌ తాజాగా ‘2.ఓ’ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here