బరువు తగ్గించే : గ్రీన్ పీస్ అండ్ పుదీనా సూప్..!!

0
11

శరీరానికి ఎలాంటి క్యాలరీలు చేరకుండా ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది. అటువంటి ఆహారాల్లో సూప్స్ బెటర్ చాయిస్. ఎందుకంటే వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సూప్స్ లో కూడా వివిధ రకాల లోక్యాలరీ సూప్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ పీస్, పుదీనా సూప్ . ఈ సూప్ తాగడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవ్వదు. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీన్ని లంచ్ , డిన్నర్, లేదా భోజనానికి ముందు తీసుకోవచ్చు.

ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నాయి. వచ్చే అథితులకు అందివ్వొచ్చు. ఈ సూప్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఈ సూప్ తాగడానికి కూడా నిజంగా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ పీస్ మింట్ సూప్ ను ఎలా తయారుచేయాలో చిటికెలో తెలుసుకుందాం

 • సర్వింగ్స్ -4
 • ప్రిపరేషన్ టైమ్: 10 minutes
 • వండటానికి పట్టే సమయం- 20 minutes

కావల్సినపదార్థాలు:

 • పచ్చిబఠానీలు- 2 cups
 • బట్టర్- 1 tsp
 • ఉప్పు : రుచికి సరిపడా
 • నీళ్ళు- 2 cups
 • ఉల్లిపాయలు- ¼ cup (chopped)
 • పాలు- ½ cup
 • ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులు- 1 tbsp (సన్నగా కట్ చేసుకోవాలి)
 • బ్లాక్ పెప్పర్ పౌడర్ – ½ tsp (సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:

 • పాన్ వేడి చేసి అందులో బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేగించుకోవాలి.
 • తర్వాత అందులో పచ్చిబఠానీలు, నీళ్ళు మిక్స్ చేయాలి. అందులో ఉప్పు వేయడం మర్చిపోకూడదు. బఠానీలు మెత్తగా ఉడికే వరకూ బాయిల్ చేయాలి.
 • పచ్చిబఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకుని, చల్లారనివ్వాలి. తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి.
 • ఇప్పుడు మరో పాన్ తీసుకుని,అందులో వాటర్ , మిల్క్, ఉడికించిన మ్యాష్ చేసి పెట్టుకొన్న గ్రీన్ పీస్ పేస్ట్ వేసి , మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
 • తర్వాత ఇందులోనే పెప్పర్, పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.కొద్దిసేపు అలాగే ఉడికించాలి. మొత్తం మిశ్రమం ఆరోమా వాసన వచ్చే వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 • అంతే గ్రీన్ పీస్, మింట్ సూప్ రెడీ దీన్ని వేడి వేడిగా బ్యూటిఫుల్ బౌల్లో సర్వ్ చేయాలి. బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here