పన్నీర్ పాయసం

0
7

ఉత్తరాది వారు ప్రత్యేక పండగలకి చేసుకునే ప్రసిద్ధ తీపి పదార్థం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని కూడా పిలవబడే దీన్ని పన్నీర్, పాలు, గట్టిపడిన పాలు మరియు సువాసనలిచ్చే ఏలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్లతో తయారుచేస్తారు. దీన్ని పండగలప్పుడే కాక,వ్రతాలప్పుడు కూడా చేస్తారు. గట్టిపర్చిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ల ముక్కలతో, పన్నీర్ యొక్క కొంచెం ఉప్పదనం తగులుతూ అద్భుతమైన రుచిని అందిస్తాయి. దీన్ని చిటికెలో శ్రమలేకుండా తయారుచేయవచ్చు. చల్లగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఇంట్లోనే తయారుచేయాలనుకుంటే చిత్రాలు, వీడియోతో కూడిన స్టెప్ బై స్టెప్ విధానాన్ని చదవండి.

పన్నీర్ పాయసం తయారీ :

 • PREP TIME 5 Mins
 • COOK TIME 15M
 • TOTAL TIME 20 Mins
 • Serves: ఇద్దరికి

INGREDIENTS

 • తరిగిన పన్నీర్ – ½ కప్పు
 • గట్టిపర్చిన పాలు – ¾ కప్పు
 • పాలు – ½ లీటరు
 • డ్రై ఫ్రూట్లు – 2-3 + అలంకరణకి
 • ఏలకుల పొడి – 1 చెంచా

HOW TO PREPARE

 1. తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి.
 2. వెంటనే పాలను జతచేయండి.
 3. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
 4. గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి.
 5. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
 6. డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.
 7. బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.
 8. తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించండి.
 9. చల్లబర్చి అందరికీ వడ్డించండి.

INSTRUCTIONS

పాలు, పన్నీర్ ల మిశ్రమం ఉండకట్టకుండా, విరిగిపోకుండా కలుపుతూనే ఉండాలి.

NUTRITIONAL INFORMATION

 • వడ్డించే పరిమాణం – ½ కప్పు
 • క్యాలరీలు – 281.5
 • క్యాలరీలు కొవ్వు – 6.8g
 • ప్రొటీన్లు – 8 g
 • కార్బొహైడ్రేట్లు – 47.6 g
 • ఫైబర్ – 0.2 g

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here