మటన్ గల్లౌటి కబాబ్ రెసిపీ

0
8

గల్లౌటి కబాబ్ చాలా మృదువుగా ఉండి నోటిలో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. గల్లౌటి అంటే నోటిలో కరగటం అని అర్ధం. ఇది ప్రసిద్ధి చెందిన అవధి వంటకం. ఇది లక్నోలో చాలా ప్రజాదరణ పొందింది. కబాబ్స్ ప్రాథమికంగా ముక్కలుగా చేసిన మేక మాంసం మరియు ఆకుపచ్చ బొప్పాయి నుండి తయారు చేస్తారు. మూలికలు మరియు మసాలా దినుసులు కలిపిన తరువాత, చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యితో వేగిస్తారు. పెద్ద ముక్కలుగా కూడా వేగించుకోవచ్చు. చెఫ్ కాశి విశ్వనాథ్ గారు చెపుతున్న సుగంధ మరియు సువాసన గల గెలాటి కేబాబ్ రెసిపీని ప్రయత్నించండి.

మటన్ గల్లౌటి కబాబ్ రెసిపీ

 • PREP TIME 1 Hour
 • COOK TIME 10M
 • TOTAL TIME 1 Hours10 Mins
 • Serves: 3

INGREDIENTS

 • మటన్ కీమా – 1 కేజీ
 • పచ్చి బొప్పాయి పేస్ట్ – 4
 • టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు
 • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
 • ఏలకులు పొడి – 1 స్పూన్
 • పసుపు కారం పొడి – 1 స్పూన్
 • చనా (గ్రామ్ ) పొడి – 2 టేబుల్ స్పూన్లు
 • గరం మసాలా పొడి – ½ స్పూన్
 • జాపత్రి పొడి – ½ స్పూన్
 • ధనియాల పొడి – 1 స్పూన్
 • ఉప్పు – రుచికి సరిపడా
 • నూనె – 3 టేబుల్ స్పూన్లు
 • నెయ్యి – 1 కప్పు

HOW TO PREPARE

 • మటన్ కీమాను నీటితో శుభ్రంగా కడగాలి.
 • ఆ తర్వాత కీమాను మ్యారినేట్ చేయాలి.
 • పచ్చి బొప్పాయి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాపత్రి పొడి, మరియు గరం మసాలా పొడి వేయాలి.
 • ధనియాల పొడి, పసుపు, కారం, చనా పొడి, ఏలకుల పొడి మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి.
 • ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.
 • ఒక గంట తరువాత రిఫ్రిజిరేటర్ నుండి కీమా మిశ్రమాన్ని బయటకు తీయాలి.
 • ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్ లో తీసుకోని టిక్కీ లుగా చేసుకోవాలి.
 • పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
 • వేడెక్కిన నూనెలో టిక్కీలను వేసి రెండు వైపుల 15-20 నిముషాల పాటు వేగించాలి.
 • కీమా బాగా ఉడికినట్టు నిర్ధారణ చేసుకోవాలి.
 • కబాబ్ రెండు వైపుల గోల్డ్ రంగు రావాలి.
 • కబాబ్స్ పూర్తిగా వేగాక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేయండి.
 • లక్నో శైలిలో తయారుచేసిన మటన్ గల్లౌటి కబాబ్ ను పుదీనా చట్నీ మరియు పచ్చి బొప్పాయి చట్నీతో తినండి.

 INSTRUCTIONS

ఖీమాను మ్యారినేట్ చేసేటప్పుడు గసగసాలను కూడా ఉపయోగించవచ్చు మ్యారినేట్ చేసేటప్పుడు గుడ్డు కలపవచ్చు

 NUTRITIONAL INFORMATION

 • సర్వింగ్ సైజ్ – 2 ముక్కలు కే
 • లరీలు – 153 కేలరీలు
 • కొవ్వు – 9 గ్రాములు
 • ప్రోటీన్ – 13 గ్రాములు
 • కార్బోహైడ్రేట్లు – 5 గ్రాములు
 • షుగర్ – 1 గ్రాములు
 • ఆహార ఫైబర్ – 1 గ్రాములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here