బ్రెడ్‌ కట్లెట్  తయారుచేసే విధానం

0
7

వేడి వేడి కట్ లెట్, ఒక కప్పు టీ, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ !సంతోషకరమై సమయాన్ని గడపడానికి ఇంతకంటే మరేం కావాలి. వర్షాకాలంలో ఇలాంటి క్రిస్పీ వంటలు రుచి చూడటానికి మంచి సమయం. జ్వరం వచ్చి అన్నం సహించనప్పుడు, రెండు లేక మూడు బ్రెడ్ స్లైసులూ, గ్లాసు పాలు తీసుకోవడం అనేది పాతమాట. సమయం లేనప్పుడు పొద్దుటి పూట టిఫిన్ గా బ్రెడ్, జామ్ లేదా చక చకా శాండ్ విచ్ చేసుకొని తినడం ఇప్పటి ట్రెండ్. అందుకే ఒక్క పిల్లలనే కాదు… కాలేజీ అమ్మాయులూ, గృహిణులూ, ఉద్యోగినులూ భారీ టిఫిన్ల కన్నా ‘బ్రెడ్ బెటర్’ అంటున్నారు. అలాంటి బ్రెడ్ తో చేసుకొనే విభిన్న రుచులలో ఒకటి బ్రెడ్ కట్ లెట్…

ఈ కట్ లెట్ ను డీప్ ప్రై చేసుకోవచ్చే లేదా బేక్ చేసుకోవచ్చు. ఈ వంటకానికి ఒక ప్రత్యేకత ఉంది. క్రిస్పీగా ఉంటుంది. ఈ క్రిస్పీ కట్ లెట్ ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం…

కావలసిన పదార్థాలు:

 • బ్రెడ్‌ స్లయిస్‌లు – 4
 • ఉడికించిమెదిపిన ఆలూ – 2
 • ఉప్పు,కారం, గరం మసాల పొడి – 1/2 టీ స్పూను చొప్పున
 • పసుపు – 1/2 టీ స్పూను
 • ఉల్లి తరుగు -1 టేబుల్‌ స్పూను
 • కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు
 • నూనె – వేగించడానికి సరిపడా
 • బ్రెడ్‌ పొడి/గసగసాలు – ½
 • కప్పు మైదా – 1 టేబుల్‌ స్పూను.

 తయారుచేసే విధానం:

 • ముందుగా ఒక గిన్నె తీసుకోని అందులో నీళ్ళు పోసి బ్రెడ్‌ స్లయిస్‌లను వేసి 20 సెకన్లు ఉంచి వెంటనే తీసి పిండేయాలి.
 • తర్వాత ఒక పాత్రలో మిగతా పదార్థాలు వేసి ముద్ద చేసుకోవాలి.
 • దళసరిగా చపాతీలా బ్రెడ్‌ గా వత్తుకుని (పిల్లలు ఇష్టపడే) షేపులో కట్‌ చేసుకోవాలి.
 • వీటిని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్‌ పొడి లేదా గసగసాలు అద్ది తరువాత స్టవ్ మీద గిన్నెపెట్టి అందులో నూనె పోసి వేడి ఎక్కాక బ్రెడ్‌ కట్ లెట్ వేసుకొని దోరగా వేగించాలి.
 • అంతే బ్రెడ్ కట్ లెట్ రెడీ..దీన్నీ ఈవెనింగ్ స్నాక్ టైమ్ లో తీసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here